
కామారెడ్డి జిల్లాలో వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆరు దశాబ్దాలుగా లేని వరదలు ఈసారి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను ముంచెత్తాయి. ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల 2వేల మందికిపైగా ప్రాణాలను కాపాడ గలిగాం. అధికారులు సైతం సరైన సమయంలో స్పందించడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణ పనులకు, పోచంపాడు, నిజాంసాగర్ ప్రాజెక్టుల మరమ్మతులకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరద బాధిత ప్రాంతాలకు ప్రభుత్వం త్వరలోనే ప్యాకేజీ ప్రకటించనుంది. – ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు