కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ తీసుకున్నాడెల్టా వేరియంట్‌ సోకుతది

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ తీసుకున్నాడెల్టా వేరియంట్‌ సోకుతది

కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్‌ సోకే అవకాశం ఉందని  ఢిల్లీ ఎయిమ్స్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(NCDC) వేర్వేరుగా జరిపిన పరిశోధనలో స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా కన్ఫాం చేయాల్సి ఉంది. 

బ్రిటన్‌లో బయట పడిన ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే ..భారత్‌లో గుర్తించిన డెల్టా రకానికి వ్యాపించే శక్తి 40-50 శాతం అధికమని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. లేటెస్టుగా ఎయిమ్స్  అధ్యయనం కూడా అదే విషయాన్ని తెలిపింది. వరుసగా ఐదు రోజుల పాటు తీవ్ర జ్వరంతో ఎమర్జెన్సీ వార్డులో చేరిన 63 మంది కరోనా బాధితుల వివరాల్ని అధ్యయనం చేసి ఎయిమ్స్‌-ఐజీఐబీ ఈ విషయాలను తెలిపింది.  

63 మందిలో 53 మంది కొవాగ్జిన్‌ మొదటి డోసు, మిగిలిన వారు కొవిషీల్డ్‌  ఫస్ట్ డోసు తీసుకున్నారు. మరో 36 మందికి ఏదేని ఒక టీకా రెండు డోసులు తీసుకున్నారు. ఒకే డోసు తీసుకున్న వారిలో 76.9% డెల్టా వేరియంట్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో 60 శాతం ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు.