గాలి ద్వారా డెల్టా వైరస్ సోకుతుంది

V6 Velugu Posted on Jul 20, 2021

గాలి ద్వారా డెల్టా వైరస్ సోకుతుందని తెలిపారు డి.హెచ్ శ్రీనివాస్ రావు. అంతేకాదు  ఇంటా, బయట మాస్క్ ధరించాలని సూచించారు. డెల్టా వెరియంట్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొదటి వేవ్ జరిగిందని చెప్పారు. రాబోయే 2,3 నెలలు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుందన్నారు. కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గలేదన్నారు. సీఎం ఆదేశాలతో 7జిల్లాలు 11 ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ తిరిగి చూడటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటి ఎక్కువ అయ్యిందని..ఎక్కువ గుంపులు సమూహాలూ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకులు ఎవరూ కరోనా రూల్స్ పాటించడం లేదని, మాస్క్ పెట్టుకోవడం లేదన్నారు. వైరస్ కంట్రోల్ చెయడం కోసం లక్ష వరకు టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొవాలన్నారు. దాదాపు ఇంకా రెండేళ్లు పాటు కరోనా వైరస్‌తో పోరాడాల్సి ఉంటుందని తెలిపారు.

Tagged DH Srinivasa Rao, Delta virus , transmitted, through air

Latest Videos

Subscribe Now

More News