ఎన్టీఆర్ కాయిన్​కు గిరాకీ.. బారులు తీరిన పబ్లిక్

ఎన్టీఆర్ కాయిన్​కు గిరాకీ..   బారులు తీరిన పబ్లిక్

హైదరాబాద్ , వెలుగు: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ పేరుతో కేంద్రం విడుదల చేసిన రూ.100 కాయిన్​కు ఫుల్ గిరాకీ నెలకొంది. మంగళవారం ఉదయం నుంచే సెక్రటేరియెట్ వెనుక ఉన్న మింట్ కంపౌండ్​లోని మింట్, చర్లపల్లి మింట్​లో  ఎన్టీఆర్​ కాయిన్​ను దక్కించుకునేందుకు పబ్లిక్, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు బారులు తీరారు.  35 గ్రాములు ఉన్న సిల్వర్ కాయిన్​ను మింట్ అధికారులు  రు.4,850కు అమ్మారు.  

ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలిపే బుక్ లెట్, కాయిన్​లు ఉన్నాయి.  మొదటి విడతలో 12 వేల నాణేల తయారు చేయగా అన్నీ అమ్ముడయినట్లు తెలుస్తోంది. కొంతమంది రెండు మూడు కొన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కాయిన్​ను గుర్తుగా దాచుకుంటామని కొనుగోలుదారులు తెలిపారు. 4 గంటలు క్యూలో ఉండి 6 కాయిన్​లను కొన్నానని ఓ వ్యక్తి తెలిపాడు.  ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగువారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని, అంతకుముందు తెలుగువారిని మద్రాసీలు అనేవారని వైజాగ్ కు చెందిన ఓ అభిమాని తెలిపారు.