హోం ట్యూటర్లకు నగరంలో పెరుగుతున్న డిమాండ్‍పార్ట్ టైంగా టీచ్ చేస్తు న్న ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అదనపు ఆదాయంతో పాటు నాలెడ్జ్ షేరింగ్ కు స్కోప్
హైదరాబాద్, వెలుగు: ఆన్‍లైన్, హోం ట్యూషన్లకు డిమాండ్ పెరుగుతోంది. జాబ్ చేస్తూనే పార్ట్ టైంగా ట్యూషన్లు చెబుతూ అదనపు ఆదాయం పొందుతుండగా, వివిధ కోర్సులను చదివేందుకు సిటీకి వచ్చినవారు పార్ ట్టైంగా ఆన్‍లైన్‍లో ట్యూషన్లు చెప్తున్నారు. టీచింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు పార్ట్ టైంగా ఆన్‍లైన్ ట్యూషన్ల రూట్ ను ఎంచుకోగా ఉదయం, సాయంత్రం వేళల్లో వీరికి డిమాండ్ ఉంది. ఖర్చు కాస్తా ఎక్కువైనా పేరెంట్ స్ తమ పిల్లలకు ఆన్‍లైన్ లేదా హోం ట్యూషన్ చెప్పిస్తున్నట్లు టీచింగ్ ఎక్స్‌పర్స్‌ట్ పేర్కొంటున్నారు.
కంప్యూటర్, నెట్ ఉంటే చాలు
ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటేచాలు. సాయంత్రం స్కూల్, కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన వారికి ఓ గంట పాటు ఆన్‍లైన్, హోం ట్యూషన్ చెప్తున్నారు. సబ్జెక్టుల్లో డౌట్లను అడిగి క్లారిఫై చేసుకునే అవకాశం ఉండగా ఇంట్రస్ట్ గా ఉన్నట్లు ఓ టీచర్ తెలిపారు.
గంటల లెక్కన ఫీజులు
స్కూల్ స్టూడెంట్స్‌కు ఆన్‍లైన్ ట్యూషన్‍లో గంటల లెక్కన ఫీజు ఉంటుంది. అదే ఇంజినీరింగ్, ఐఐటీ, నీట్ తదితర కోర్సుల వారికి మాత్రం సబ్జెక్టు లెక్కన ప్యాకేజీ ఉంటుంది. స్కూల్ లెవల్ లో అయితే గంటకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంటర్ లో ప్యాకేజీ ఉంటుంది. సబ్జెక్టును బట్టి రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంటుందని ఎక్స్‌పర్స్‌ట్ చెప్పారు. హోం ట్యూషన్ ఫీజులు వేరుగా ఉంటాయి. ఇంటికి పోయి చెప్పే ఒక్కో ట్యూటర్ రూ.10 వేల వరకు వసూలు చేస్తారు. రోజులో ఒక గంట పాటు క్లాస్ తీసుకుంటారు. ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా తమకు అనుకూలమైన సమయంలో ఆన్‍లైన్, హోం ట్యూషన్ చెప్తారు.
పాషన్, హాబీ కోసం
తక్కువ టైంలో ఎక్కువ మనీ రావడం కూడా ఆన్‍లైన్, హోం టీచింగ్ వైపు కొత్త వారు ఆకర్షితులవున్నట్లు ఈ రంగంలో ఎక్స్‌పర్స్‌ట్ చెప్తున్నారు. తమకు వీలైన సమయంలోనే ఆన్‍లైన్ స్లాట్ తీసుకునే వీలు ఉండడంతో ఐటీ ఎంప్లాయీస్ కూడా ఆన్‍లైన్ టీచింగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆన్‍లైన్ టీచింగ్ ఆదాయ వనరుగా మారింది.