మిడ్​డే మీల్స్​కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మిడ్​డే మీల్స్​కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు : మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ ​చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముందు ధర్నా నిర్వహించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పోరాడుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని ఫైర్​ అయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం స్తంభించినప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని,  లేదంటే ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేశ్, లింగాల చిన్నన్న, ఎండీఎం కార్మిక సంఘం నాయకులు సంగీత, లక్ష్మి, కిష్టమ్మ, రేఖ తదితరులు పాల్గొన్నారు. 

గ్రామ సమస్యలు తీర్చకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం

గాదిగూడ మండలం కుండిసేకు గూడ గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ ఆ గ్రామస్తులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు సోమవారం ఆదిలాబాద్​ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తాగునీరు, రోడ్డు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఎన్నోసార్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదంటూ కలెక్టరేట్ గేటుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని, వెంటనే సమస్యలు పరిష్కరించాలన్నారు.