రుద్రూర్ మండల కేంద్రంలో గోమాంస అమ్మకాలు ఆపాలి : ముస్లింలు

రుద్రూర్ మండల కేంద్రంలో గోమాంస అమ్మకాలు ఆపాలి : ముస్లింలు
  •     ముస్లింల డిమాండ్​

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో పశుమాసం మార్కెట్ వద్ద అపరిశుభ్ర గో మాంసం విక్రయాలు చేస్తున్నారని వెంటనే విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు సోమవారం తహసీల్దార్ తారాబాయి, జీపీ సెక్రటరీ ప్రేమ్​దాస్​కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పశుమాంసం మార్కెట్ వద్ద అపరిశుభ్రమైన గోమాంసాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. 

ఆర్టీసీ బస్​షెల్టర్, మండల సముదాయం, ప్రభుత్వ బాలికల హైస్కూల్, కూరగాయాల సంతకు వచ్చే వందలాది మంది ప్రజలు, ప్రయాణికులు పశు మార్కెట్ దారిగుండా వెళ్తుంటారని, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఉపసర్పంచ్ నిస్సార్​, నాయకులు నజీర్, గులాబ్​, మజీద్​, మజీద్​ కమిటీ నాయకులు పాల్గొన్నారు.