డీమార్ట్స్ నికర లాభం రూ.690 కోట్లు

డీమార్ట్స్ నికర లాభం రూ.690 కోట్లు
  •      రెవెన్యూ రూ.13,572 కోట్లు

న్యూఢిల్లీ :  డీమార్ట్‌‌ స్టోర్లను ఆపరేట్ చేస్తున్న అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌కు కిందటి నెలతో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ3) లో రూ. 690 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌) వచ్చింది.  2022 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.589.64 కోట్లతో పోలిస్తే 17 శాతం పెరిగింది.  కంపెనీ స్టాండ్‌‌ ఎలోన్  నెట్ ప్రాఫిట్‌‌ 15 శాతం పెరిగి రూ.641.07 కోట్లకు  చేరుకుంది.  అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌కు క్యూ3 లో రూ.13,572.47 కోట్ల (కన్సాలిడేటెడ్‌‌) రెవెన్యూ  వచ్చింది. 

ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 17 శాతం ఎక్కువ. 2022 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.11,569.05 కోట్ల రెవెన్యూని కంపెనీ సాధించింది. స్టాండ్ ఎలోన్ రెవెన్యూ 17 శాతం ఎగసి రూ.11,304.58 కోట్లకు చేరుకుంది.  ఈసారి పండుగ సీజన్ సేల్స్ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌ సీఈఓ నెవెల్లి నోరొన్హో  అన్నారు. నాన్‌‌ ఎఫ్‌‌ఎంసీజీ సెగ్మెంట్‌‌లో అమ్మకాలు తగ్గాయని చెప్పారు. 

ఎఫ్‌‌ఎంసీజీ సెగ్మెంట్‌‌లో కూడా  ఎడిబుల్ ఆయిల్ వంటి వ్యవసాయం ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగాయని వివరించారు. డిసెంబర్‌‌‌‌ 31  నాటికి మొత్తం 341 డీమార్ట్ స్టోర్లను అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌ ఆపరేట్ చేస్తోంది. ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్ట్‌‌ హరిచంద్ర ఎం భరూకాను ఐదేళ్లకు గాను ఇండిపెండెంట్ డైరెక్టర్‌‌‌‌గా కంపెనీ నియమించింది. అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ షేర్లు శుక్రవారం అర శాతం పెరిగి  రూ.3,843 దగ్గర క్లోజయ్యాయి.