భ‌వ‌నాల కూల్చివేత.. మ‌ళ్లీ వాయిదా వేసిన హైకోర్ట్

భ‌వ‌నాల కూల్చివేత.. మ‌ళ్లీ వాయిదా వేసిన హైకోర్ట్

హైద‌రాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత విచార‌ణ‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. విచార‌ణ‌ను మ‌రోసారి వాయిదా వేసింది హైకోర్టు. విచార‌ణ‌ను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. భవనాల కూల్చివేతపై స్టే శుక్ర‌వారం వరకు కొనసాగుతుంద‌ని చెప్పింది. కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా లేదో తెలపాలని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు. ఎన్విరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జ్ మెంట్ లను హైకోర్టుకు సమర్పించిన ఏజీ..భవనాల కూల్చివేతకు ఎన్విరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని తెలిపింది. అయితే ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్ లో కూల్చివేత కూడా వస్తుందని తెలిపారు పిటీషనర్ తరపు న్యాయవాది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం 2018కి విరుద్దంగా కూల్చివేత పనులు చేపడుతున్నారన్నారు.

కాగా ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్ రీజర్వమెంట్స్ తీసుకోవాలి కానీ.. కూల్చివేతకు అవసరం లేదని చెప్పింది ప్రభుత్వం. కేంద్ర పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెపుతుందో తెలపాలని అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ ను ఆదేశించింది హైకోర్టు. భవనాల కూల్చివేత సమస్య కేంద్ర చేతిలో ఉందని తెలిపింది హైకోర్టు. ఎన్వీరార్మెంట్స్ ప్రోటక్షన్ యాక్ట్ ప్రకారం భవనాలు కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని సూచించింది హైకోర్టు. ఎన్వీరాల్ మెంట్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా అనుమతులపై తుది నిర్ణయం వెల్లడించాకే దీనిపై తుది ప్రకటన ఇస్తామని తెలిపింది హైకోర్టు. భవనాల కూల్చివేతకు అనుమతి అవసరంలేదని.. కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమన్న ఏజీ.. నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటామ‌ని హైకోర్టుకు మరోసారి తెలిపింది. జీహెచ్ఎంసీ, లోకల్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు సరిపోతాయని కోర్టుకు తెలిపింది ఏజీ. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.