హైడ్రా కొరడా..మణికొండ డాలర్ హిల్స్ కాలనీలో కూల్చివేతలు

హైడ్రా కొరడా..మణికొండ డాలర్ హిల్స్ కాలనీలో కూల్చివేతలు

హైదరాబాద్ లో హైడ్రా కొరడా ఝులిపిస్తోంది.   మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని  డాలర్ హిల్స్ కాలనీలో పార్కు స్థలం కబ్జా చేసి చేపట్టి నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. పార్క్ స్థలం కబ్జాకు గురైందని  హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు  ఫిర్యాదు చేశారు డాలర్ హిల్స్ కాలనీ వాసులు. 15 రోజుల క్రితం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు..మే 14న  డాలర్ హిల్స్ కాలనీ లో స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్. ఇవాళ  తెల్లవారుజామున భారీ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. 

పార్క్ కబ్జాకు గురైందని   మూడు సంవత్సరాల నుంచి  మున్సిపాలిటీ , హెచ్ఎండిఏ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవలేదని స్థానికులు అన్నారు. అయితే  హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చిన 15 రోజులకే  హైడ్రా కమిషనర్ రంగనాథ్ సలాన్ని పరిశీలించడం.... చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డాలర్ హిల్స్ కాలనీ వాసులు. 

►ALSO READ | మియాపూర్ హైదర్ నగర్లో హైడ్రా కూల్చివేతలు

 మరో వైపు మియాపూర్ హైదర్ నగర్ దగ్గర  సర్వే నంబర్‌ 145/3లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తోంది . 9ఎకరాల 30గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్  పేరిట అసోసియేషన్ ఏర్పాటు  చేశారు.  లే ఔట్ లో మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి.  ఆ స్థలాన్ని  పలువురు వ్యక్తులు ఆక్రమించారు.  9 నెలల కిందట హెచ్ఎండిఏ లేఔట్ గా తేల్చింది హైకోర్టు.  ఖాళీ చేయాలని హైకోర్టు  ఆదేశించినా  కబ్జా దారుల ఖాళీ చేయలేదు.దీంతో బాధితులు  హైడ్రాను ఆశ్రయించారు.  కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది హైడ్రా.