‘డెంగీ’ పంజా: పట్టించుకోని వైద్యశాఖ

‘డెంగీ’ పంజా: పట్టించుకోని వైద్యశాఖ

వికారాబాద్ జిల్లా మోమిన్ పేటమండలం చంద్రాయన్ పల్లిపై డెంగీపంజా విసిరింది. 13 నెలల చిన్నారిని బలి తీసుకుంది. మరో ఏడుగురికి వ్యాధి లక్షణాలున్నట్టు డాక్టర్లు గుర్తించారు. బాధితులు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఊరు ఊరంతా విషజ్వరాలతో తల్లడిల్లుతోంది. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

వికారాబాద్‍ జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. మోమిన్ పేట మండలం చంద్రాయన్ పల్లి లో వ్యాధితో ఓ చిన్నారి చనిపోయింది. పది రోజుల క్రితం సహస్ర (13నెలలు) అనే బాలిక జ్వరంతో బాధపడుతుంటే దవాఖానాలో చేర్పించారు. చికిత్స పొందుతూ నాలుగు రోజుల క్రితం చనిపోయింది. తీవ్ర జ్వరం, ఒళ్లునొప్పులతో చిన్నారిని ఆమె తండ్రి జైపాల్ రెడ్డి సంగారెడ్డిలోని ప్రైవేట్ హాస్పి టల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నిలోఫర్ తరలించారు. వైద్య పరిక్షల తర్వాత ఆమెకు డెంగీ వ్యాధి సోకినట్లు డాక్టర్లు చెప్పారు.చికిత్స పొందుతూ గత శుక్రవారం చనిపోయింది.

చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన దివ్య(6), వాణి(4) అక్క చెల్లెళ్లకు కూడా డెంగీ సోకింది. చికిత్స కోసం ఇప్పటి దాకా వారి తల్లిదండ్రులు దాదాపు లక్ష రూపాయల దాకా ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. అదే విధంగా గ్రామానికి చెందిన సాత్విక్ రెడ్డి(4), తేజు (6), దూదేకుల ముక్తిం(6), ప్రవీణ్ కుమార్(21), హర్షత్(4) ప్రైవేటు దవాఖానాలో తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఒకే గ్రామంలో ఓ చిన్నారి చనిపోయి, మరో ఎనిమిది మందికి డెంగీ సోకినట్లు డాక్టర్లు నిర్దారించినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ స్పందించక పోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రాయన్ పల్లికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రభుత్వ దవాఖానా ఉంది. డెంగీతో పాటు, విషజ్వరాలతో గ్రామస్తులు బాధపడుతున్నా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయలేదు. డెంగీ సోకిన వారి ఇళ్లకు వెళ్లి అంగన్ వాడీ కార్యకర్తలు రక్త నమూనాలను సేకరిస్తున్నారు కానీ, విషజ్వరాలు సోకిన వారి నుంచి కూడా బ్లడ్ టెస్ట్​ శాంపిల్స్ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కండ్లముందే కన్నుము సిందిఅల్లారుముద్దు గా పెంచుకున్న మాపాపకు జ్వరం వచ్చింది . సదాశివపేటలోనిప్రైవేటు దవాఖానాలో చూపించాం .అక్కడ్నుం చి సంగారెడ్ డిలోని ప్రభుత్వదవాఖానాకు తీసుకెళ్లాం . అక్కడి డాక్టర్లుపాప పరిస్థతి బాగాలేదు నిలోఫర్ కువెళ్లాలంటే అక్కడికి తీసుకెళ్లాం . చికిత్సపొందుతూ కండ్ల ముం దే బిడ్డచనిపోయింది .– జైపాల్ డ్డి (సహస్ర తండ్రి)

పందులను తరలించా లెగ్రామంలో చాలా వరకు నిరుపేదలే ఉన్నారు. పెద్దరోగాలు వస్తే మేమెలా తట్టుకోవాలె. పందులను వేరోచోటకు తరలిస్తేనె రోగాలు రాకుం డా ఉంటాయి.అధికారులు స్పందించి పందులబారినుంచి మమ్మల్ని కాపాడాలి.– మణెయ్య, చంద్రాయన్ పల్లి

డెంగీ సోకడం మొదటి సారిఇప్పటి వరకు విషజ్వరాలు, డెంగీవంటివి మాకు తెల్వదు. సహస్రతోనేడెంగీ సోకిన విషయం తెలిసింది . ఇండ్లమధ్య పందులు విచ్చలవిడిగాతిరుగుతుం టాయి. వాటితోచిన్నారులకు రోగాలు వస్తు న్నాయి.అధికారులు చొరవ తీసుకుని మంచివైద్యం అందించాలి.– అంజమ్మ, చంద్రాయన్ పల్లి