
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మరో రూ. 47వేల కోట్ల మూలధన వ్యయ ప్రణాళికను సిద్ధం చేసిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపింది. 4జీ మొబైల్ సేవల కోసం లక్ష టవర్లను ఏర్పాటు చేయడానికి బీఎస్ఎన్ఎల్ గత సంవత్సరం రూ. 25వేల కోట్లు ఖర్చు చేసింది. టీసీఎస్, సీ-డాట్ నేతృత్వంలోని కన్సార్టియం బీఎస్ఎన్ఎల్కు టెలికాం గేర్ సరఫరా చేయడానికి రూ. 25వేల కోట్ల ప్రాజెక్ట్‌లో ఎక్కువ భాగాన్ని దక్కించుకున్నాయి. రాబోయే సంవత్సరంలో తన మొబైల్ సేవల వ్యాపారాన్ని 50 శాతం పెంచాలని కేంద్ర టెలికం మంత్రి సింధియా బీఎస్ఎన్ఎల్ను కోరారు.