కోల్బెల్ట్ ప్రాంతాన్ని కమ్మేసిన పొగమంచు

కోల్బెల్ట్ ప్రాంతాన్ని కమ్మేసిన పొగమంచు

గోదావరిఖని, వెలుగు: పొగమంచు కోల్​బెల్ట్ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో శనివారం తెల్లవారుజామున రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పాలు తీసుకువచ్చేవారు, పనుల నిమిత్తం వచ్చేవారు ఇబ్బంది పడ్డారు. రాజీవ్​ రహదారిపై వెహికల్స్​లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రామగుండం ఏరియాలోని 4 సింగరేణి ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్టులలో పొంగమంచు కారణంగా పనులు నిలిపివేశారు.  

సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలంలో పొగమంచు కారణంగా శనివారం ఉదయం 8 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. రాజీవ్ రహదారి కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణం సాగించారు. ఉదయం 10 గంటలకు సూర్యుడు దర్శనమిచ్చాడు.