చేర్యాల మండలంలో స్కూళ్లను తనిఖీ చేసిన డీఈఓ

చేర్యాల మండలంలో స్కూళ్లను తనిఖీ చేసిన డీఈఓ

చేర్యాల, వెలుగు: మండలంలోని గుర్జకుంట యూపీఎస్​, జడ్పీహెచ్ఎస్​, దొమ్మాట యూపీఎస్​ స్కూళ్లను గురువారం డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సరిగ్గా బోధిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఆర్పీ కనకరాజు ఉన్నారు.