ఆసిఫాబాద్ జిల్లాలో ఇయ్యాల (జనవరి 22 న ) డిప్యూటీ సీఎం పర్యటన

ఆసిఫాబాద్ జిల్లాలో ఇయ్యాల (జనవరి 22 న ) డిప్యూటీ సీఎం పర్యటన

ఆసిఫాబాద్, వెలుగు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం ఉట్నూర్​లో పర్యటించిన డిప్యూటీ సీఎం గురువారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి 10.30 గంటలను జైనూర్​మండలం జాంగావ్ చేరుకుంటారు. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించి పలు గ్రామాల ప్రజలతో మాట్లాడతారు. 12.30 గంటలకు బూసిమెట్టకు చేరుకొని పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. 

అక్కడ నుంచి కెరమెరి మండలం మోదీ ఆశ్రమ పాఠశాలకు చేరుకొని వ్యవసాయ శాఖ తరపున యంత్రాలు పరికరాలు అందజేస్తారు. పలు గ్రామాల ప్రజలతో మాట్లాడి మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ కు చేరుకొని అక్కడే 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్త సఫారీ వాహ నాన్ని ప్రారంభించి, 3.30 నుంచి 4.30 గంటల వరకు విద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.