
ముంబై: మహారాష్ట్రలో 44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లు మాఫీ చేయాలని నిర్ణయించామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం 2024–25 బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ గత కొన్నేండ్లుగా వాతావరణ మార్పుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కల్పించేందుకు ‘ముఖ్యమంత్రి బలిరాజా విజ్ సౌలత్ యోజన’ కింద 44 లక్షల మంది రైతులకు కరెంటు బిల్లును మాఫీ చేస్తున్నామని చెప్పారు. రైతుల విద్యుత్ బిల్లుల భారాన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 7.5 హార్స్ పవర్ సామర్థ్యంతో వ్యవసాయ పంపులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడించారు.