ఓటాన్​ అకౌంట్​ ఎందుకంటే..! : భట్టి విక్రమార్క

ఓటాన్​ అకౌంట్​ ఎందుకంటే..! : భట్టి విక్రమార్క

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓటాన్ అకౌంట్​ బడ్జెట్​ ప్రవేశ పెట్టినందునే తామూ అదే పనిచేయాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. ఈ తరహా బడ్జెట్​ తమకు ఇష్టం లేదని, అయితే వివిధ పథకాలకు కేంద్రం ఏ స్థాయిలో నిధులు విడుదల చేస్తుందో స్పష్టత లేదన్నారు.

ఎన్నికల తర్వాత కేంద్రంలో పూర్తి స్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టిన అనంతరం తాము కూడా సరైన అంచనాలకు రాగలుగుతామని వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటాను చూసి రాష్ట్రంలోనూ పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెడతామని వెల్లడించారు. కేంద్ర పూర్తి బడ్జెట్ తర్వాత కొన్ని రంగాల కేటాయింపులు మరింత మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.