సభలో ఏంటీ రాద్ధాంతం!..బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

సభలో ఏంటీ రాద్ధాంతం!..బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
  •     సభ జరగకుండా చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు
  •     గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా మేం హుందాగా వ్యవహరించినం
  •     బడ్జెట్ పేపర్లు చింపడం.. చెవిలో పువ్వులు పెట్టుకొని వెళ్లడం వంటి పనులు చేయలే
  •     సభ్యులు సభా సంప్రదాయాలు పాటించాల్సిందేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అసెంబ్లీలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఒక బిల్లు ప్రవేశపెట్టి చర్చిస్తుంటే, ఆ చర్చ జరగనీయకుండా.. సభా సంప్రదాయాలు పాటించకుండా.. పార్లమెంటరీ భాష ఉపయోగించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం సరైంది కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రజల అవసరాలు తీర్చేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేయడం కరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు. 

2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మేము అప్పటి సభలో ఉన్నాం. ఆ సమయంలో బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడూ బడ్జెట్ కాపీలను చింపి చెవిలో పెట్టుకుని వెళ్లడం కానీ, డిమాండ్లపై చర్చ జరిగినప్పుడు అల్లరి చేయడం కానీ చేయలేదదు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తగదు”అని ఆదివారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యులు సభలో ప్రవర్తించిన తీరుపై ఆయన మండిపడ్డారు. 

మూడు హౌస్ కమిటీలతో సాధించిందేమిటి? 

బీఆర్ఎస్ హయాంలో మూడు హౌస్ కమిటీలు ఏర్పాటు చేయగా.. వాటి ద్వారా ఏం సాధించారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఆ హౌస్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న తాను ఆనాడు సమావేశాలు నిర్వహించాలని కోరినప్పటికీ ఒక్క మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పెట్టలేదని గుర్తుచేశారు. హౌస్ కమిటీలను అడ్డం పెట్టుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయిల్ చేసి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చుకోవడం తప్ప, ఒక్క కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేకపోయారని విమర్శించారు. 

‘‘సభ సజావుగా నడవకూడదు.. ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వెల్ఫేర్ పథకాలపై చర్చ జరగకూడదు.. విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ పథకంపై చర్చించొద్దు.. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తప్ప ఎవరికి మేలు జరగకూడదనే ఆలోచనతోనే ఆ పార్టీ సభ్యులు సభకు వచ్చినట్టుగా కనిపిస్తోంది”అని విమర్శించారు. 

ముందస్తు నోటీసు ఇవ్వకుండా సభలో మంత్రి పేరును వెల్లడించకూడదని, అయినా ఆ పేరును బయట పెట్టారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రిపై లేవనెత్తిన అంశాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. 2014 నుంచి 2026 మార్చి 28 వరకు మైనింగ్ రంగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తానని ప్రకటించారని, ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతించాలి.. కానీ కావాలనే సభను నడవనీయకుండా రాద్ధాంతం చేయడం తగదన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి 8 నెలలు అవుతున్నా.. బీజేపీ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయని ఆయన ఆరోపించారు. ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలు, బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమ పద్ధతిలో జరిగిన భూ బదిలీలపై సీఎం హౌస్ కమిటీ వేయాలని చేసిన ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హౌజ్ కమిటీపై నమ్మకం ఉంటే సీఎం ప్రకటించిన హౌస్ కమిటీకి అంగీకరించాలని సవాల్ చేశారు. 

సోలార్ విద్యుత్ వినియోగంపై ఆదర్శంగా నిలవాలి

ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిథులు తమ సొంత ఇండ్లలో 2 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యక్తిగతంగా లేఖలు అందజేశారు. రాష్ట్రాన్ని హరిత శక్తి సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మోడల్ సోలార్ విలేజ్”కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. 

ప్రజల్లో సౌర విద్యుత్ పట్ల అవగాహన కల్పించాలంటే ముందుగా నాయకులే ఆదర్శంగా నిలవాలని, తద్వారా నివాస ప్రాంతాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చవచ్చని ఆయన  ఆకాంక్షించారు.