ఫామ్హౌస్లో జల్సాలు చేస్తూ.. ప్రభుత్వంపై విషప్రచారం : భట్టి విక్రమార్క

ఫామ్హౌస్లో జల్సాలు చేస్తూ.. ప్రభుత్వంపై విషప్రచారం : భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఓడిపోయి ఫామ్ హౌజ్ లో పడుకుని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  తెలంగాణ కోసమే పుట్టామని చెప్పుకుని వేల  కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కూలిపోయే కాలేశ్వరంలో  వందల కోట్లు పోశారని ఆరోపించారు. పదేళ్లలో ఏనాడైనా ఉద్యోగులకు జీతాలిచ్చారా? అని ప్రశ్నించారు భట్టి.

ఖమ్మం జిల్లా రఘునాదపాలెం మండలంలో మెడికల్ కళాశాలకు భూమిపూజ చేశారు భట్టి విక్రమార్క.. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  సూపర్ స్పెషాలిటీ సదుపాయలకోసం హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఖమ్మంలోనే విలువైన వైద్యం అందనుందని చెప్పారు.  ఇది పేదల ప్రభుత్వం  దొరల పాలన కాదు దొరల స్వార్థ కోసం పని చేసే పార్టీ అంతకన్నా కాదన్నారు.  8 కొత్త కళాశాలలకు కొత్త భవనాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్యా, వైద్యం కోసం చాలా ఖర్చు పెడుతున్నామని చెప్పారు.  కొందరు తెలంగాణ కోసమే పుట్టామని డబ్బాలు కొట్టుకుంటూ వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. మొన్నటి సభలో అడ్డగోలు అబద్ధాలు ప్రచారాలు చేశారని మండిపడ్డారు భట్టి.

కేసీఆర్ లెక్కలు చెబుతా రాసుకో..  మేం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు వైద్యం ఇస్తున్నాం. మీ హయాంలో ఆరోగ్య శ్రీ నీ పూర్తిగా వదిలేశారు. మేము 306 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.  మీరు10 ఏళ్లు రెసిడెన్షియల్ స్కూళ్లను గాలికి వదిలేశారు. మేం రూ.22500 కోట్లతో ఇందిరమ్మ  ఇళ్లు ఇస్తున్నాం. ప్రతి నియోజక వర్గంలో 3500 ఇల్లు ఇస్తున్నాం.  ఒకే దఫా 22 వేల కోట్లతో రుణమాఫీ చేశాం. 

200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.  రూ. 500 కే గ్యాస్ ఇస్తున్నాం. సీతారాం ప్రాజెక్టు గాలికి వదిలేస్తే మేం ఖర్చు పెట్టి వాడుకలోకి తీసుకొస్తున్నాం.  ఓడిపోయి ఇళ్లలో,ఫామ్ హౌజ్ లలో ఎంజాయ్ చేస్తూ విష ప్రచారం చేస్తున్నారు  10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చారా. మేం 9 వేల కోట్లతో ఉపాధి కల్పించాం. ఇందిరా గిరిజ జల ప్రభ ద్వారా గిరిజన రైతులకు పంపు సెట్లు ఇవ్వబోతున్నాం.  మీరు చేసిన అప్పులు అన్ని ఇన్ని కావు.మీలా దుబారా ఖర్చులు పెట్టడం లేదు.  10 ఏళ్లలో 1 వ తేదీన జీతాలు ఇచ్చారా.  మేము మొదటి తారీకునే జీతాలు ఇస్తున్నాం. త్వరలో ఉద్యోగులకు రావాల్సిన ,కావలసిన వాటిని కూడా సమకూరుస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తూ ప్రజలను పెడదోవ పట్టిస్తున్నారు.  మీరు చేసిన అప్పులు కడుతూ సంక్షేమ పథకాలను నడిపిస్తున్నాం. మీ లాగా కృంగిపోయే కాళేశ్వరంలో కోట్లు కుమ్మరించడం లేదు.  ప్రజా అవసరం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం అని భట్టి అన్నారు.