
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్‌నేతలకు అవగాహన లేదంటూ కేసీఆర్చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. అసలు అవగాహన లేనిదే కేసీఆర్‌కు అని ఫైర్అయ్యారు. మంగళవారం గాంధీభవన్‌వద్ద వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలపై కేసీఆర్‌కే అవగాహన లేదని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఇరిగేషన్ప్రాజెక్టులు, నీళ్లపై కాంగ్రెస్‌కు అవగాహన ఉన్నది కాబట్టే నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్సారెస్పీ, కడెం వంటి పటిష్టమైన ప్రాజెక్టులను కట్టాం. కేసీఆర్‌కు నీళ్ల మీద కనీస అవగాహన లేదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టారు. కేసీఆర్‌కు, మాకున్న తేడా అదే” అని విమర్శించారు.
రూ.94 వేల కోట్లతో కూలిపోయే కాళేశ్వరం లాంటి నాసిరకం ప్రాజెక్టులు కట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవాళ్లు కూడా తమపై ఆరోపణలు చేయడం దారుణమని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్నీళ్లు తీసుకురావడంలో ఎక్స్పర్ట్కాదు. కానీ పైసలు ఎట్ల తేవాలన్న దాంట్లో మాత్రం ఎక్స్పర్ట్. నీళ్ల పేరుతో దోచుకోవడంలో కేసీఆర్స్పెషలిస్ట్” అని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ దోచుకునేందుకు కేసీఆరే సహకరించారని, ఆయన ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై కేసీఆర్ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపడం లేదని, ముందు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల గురించి మాట్లాడాలని అన్నారు. అన్ని విషయాలపైనా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు.