నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు

నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు

మహారాష్ట్రలో నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ఈడీ ప్రభుత్వమని కొందరు విమర్శిస్తున్నారని ..అవును ఇది ఏక్ నాథ్, దేవేంద్రకు చెందిన ఈడీ ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లోనే శివసేన బీజేపీ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారని..కానీ మమ్మల్ని అధికారం నుంచి ఉద్దేశపూర్వకంటా తొలగించారని చెప్పారు. కానీ ఏక్నాథ్ షిండేతో కలిసి మరోసారి శివసేనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఏక్నాథ్ షిండేకు బయట నుంచి మద్దతు ఇవ్వాలని మొదట్లో అనుకున్నా..పార్టీ ఆదేశానుసారం తాను డిప్యూటీ సీఎం పదవిని చేపట్టానని ఫడ్నవీస్ తెలిపారు. పార్టీ ఏది చెప్తే ఆ పని చేయడం తన కర్తవ్యమని..పార్టీ ఇంట్లో కూర్చోమని చెప్తే..కూర్చుంటానన్నారు. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో ఎప్పుడు గొడవలు ఉండవని..తాము ఈ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకారం అందిస్తూనే ఉంటామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.