డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శనివారం ( నవంబర్ 8 ) జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి ఎర్రచందనం గోడౌన్లను తనిఖీ చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం మంగళం ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం గోడౌన్లను సందర్శించారు పవన్. ఆ తర్వాత కలెక్టరేట్ లో అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గోడౌన్లలో ఉన్న ఎర్రచందనాన్ని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో పాటు శేషాచల కొండల్లో ఉన్న అరుదైన వన్యప్రాణులు, వృక్ష సంపదను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు పవన్.
ఇదిలా ఉండగా.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఇవాళ ( నవంబర్ 8 ) తిరుపతిలోని ఎర్రచందనం డిపోలను పరిశీలించిన పవన్ రేపు ( నవంబర్ 9 ) పలమనేరులో కుంకీ ఏనుగుల సంరక్షణ, అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్.
