ప్రభుత్వ సలహాదారుడిని అవమానిస్తారా?..బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ మేయర్ ఆగ్రహం

ప్రభుత్వ సలహాదారుడిని అవమానిస్తారా?..బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ మేయర్ ఆగ్రహం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్​నేతల తీరుపై జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్​మోతే శ్రీలతాశోభన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం జరిగిన బోనాల చెక్కుల పంపిణీకి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి తో పాటు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ హాజరయ్యారు.

. కార్యక్రమం అనంతరం డిప్యూటీ మేయర్​మోతే శ్రీలతా శోభన్​ రెడ్డి మాట్లాడుతూ..  ప్రభుత్వ సలహాదారుడిని అవమానపరిచే విధంగా వ్యవహరించడం బీఆర్ఎస్​నేతలకు తగదన్నారు. ఆయన కార్యక్రమంలో ఉన్న సమయంలో కరెంట్ సరఫరాను నిలిపివేసి, ఆయన వెళ్లిపోయాకా తిరిగి కరెంట్ ను పునరుద్దరించడం హేయమైన చర్య అని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జరిగిన ఘటనపై విచారణ జరిపించి, కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.