
పటాన్చెరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్తో పేదలకు ఆర్థిక భరోసా ఇస్తోందని కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంప్‌ఆఫీస్‌లో లబ్ధిదారులు ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన తిప్పగుడిసె సుజాత, కరణం మంజులకు రూ.60 వేల చొప్పున, నవీన్‌కు రూ.30 వేలు, చిట్కుల్ కు చెందిన మన్నె వెంకటేశ్, బొల్లారం మున్సిపాలిటీకి చెందిన రెడ్డి లక్ష్మణరావుకు రూ.60 వేల చొప్పున, గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన తుడుం రాజమ్మకు రూ.55 వేల విలువైన సీఎంఆర్ఎఫ్చెక్కులు అందజేశారు.
పేదల వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం, బొల్లారం మాజీ కౌన్సిలర్ సుజాత మహేందర్ రెడ్డి, నాయకులు ముత్తంగి అశోక్, తుడుం శ్రీనివాస్, గారెల మల్లేశ్, మన్నె రఘు, భిక్షపతి రెడ్డి, గోపాల్, గారెల శ్రీనివాస్, దశరథ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.