
నస్పూర్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమలో భాగంగా బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పర్యవేక్షకుడు కోటేశ్వర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్‌తో కలిసి వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆస్పత్రి, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యమం బాగుంటే శక్తివంతమైన కుటుంబం తయారవుతుంద న్నారు. ఈ శిబిరాల్లో వైద్యంతోపాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు