- రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి
నర్సాపూర్, వెలుగు: చిన్నచింతకుంట శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్‌శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం విశ్వకర్మ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట
గజ్వేల్, వెలుగు: విశ్వకర్మ జయంతి వేడుకలను గజ్వేల్పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముట్రాజుపల్లి ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. వీర బ్రహ్మేంద్రస్వామి బోధనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జఖీ తదితరులున్నారు.
విశ్వకర్మ జయంతి వేడుకలు
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ బ్రహ్మంగారి మందిరంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, కార్పొరేటర్ సింధు, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వివిధ పార్టీల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.
