
- జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
నిర్మల్, వెలుగు: ఉపాధ్యాయులు సమాజానికి మార్గ నిర్దేశకులని నిర్మల్ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా స్థాయిలో విద్యా శాఖ ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి నిర్మల్‌లో సన్మానించారు. అంతకుముందు రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లు అరవింద్, నరేందర్‌ను సన్మానించారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివన్నారు.
వారిని సన్మానించడం తన అదృష్టమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో భోజన్న, ఎక్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ పరమేశ్వర్, పీఆర్టీయూ అధ్యక్షుడు నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి రమణారావు, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గజేందర్, జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్, కార్యదర్శి లక్ష్మణ్, యూటీఎఫ్ అధ్యక్షుడు రవికాంత్, శంకర్, మసీయొద్దీన్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.