సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.   తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు.  

గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై  అసంతృప్తిలో ఉన్నారు  మోతే శోభన్ రెడ్డి.  దీంతో ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.  శ్రీలత సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎంతో భేటీ అయ్యారని తెలుస్తోంది.  

 ప్రస్తుతం శ్రీలత డిప్యూటీ మేయర్ గా కొనసాగుతుండగా ఆమె భర్త శోభన రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.  కాగా ఇటీవల మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు.