విజయనగరం: పట్టాలు తప్పిన గూడ్స్ ... పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

విజయనగరం: పట్టాలు తప్పిన గూడ్స్ ... పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

విజయనగరం రైల్వే స్టేషన్​ సమీపంలో గూడ్స్ ఈ రోజు ( ఆగస్టు 29) ఉదయం పట్టాలు తప్పింది.   ట్రాక్​ నుంచి మూడు బోగీలు పక్కకు తప్పుకోవడంతో  పలు రైళ్ల రాక పోకలకు అంతరాయం కలిగింది. 

విజయనగరం రైల్వే స్టేషన్​ సమీపంలోని సంతకాల వంతెన దగ్గర గూడ్స్​ ట్రైన్ శుక్రవారం ( ఆగస్టు 29) పట్టాలు తప్పింది. దీంతో  పలు రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది.ఎమర్జెన్సీ బ్రేకులు వేసినందునే ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుతోంది.  సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, టెక్నికల్ టీమ్ స్పాట్‌కు చేరుకున్నారు. ట్రాక్​ మరమ్మత్తు పనులు  ప్రారంభమయ్యాయని... ఈ రోజు ( ఆగస్టు 29) మధ్యాహ్నానికి  పూర్తిచేస్తామని అధికారులు  తెలిపారు.

రైళ్ల వివరాలు

  • విజయనగరం – విశాఖపట్నం
  •  విశాఖపట్నం –  పలాస
  •  పలాస –  విశాఖపట్నం
  • విశాఖపట్నం-– కోరాపుట్
  • కోరాపుట్– విశాఖపట్నం

ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తెలుసుకోవడానికి రైల్వే హెల్ప్‌లైన్లను సంప్రదించాలని అధికారులు సూచించారు..