పెళ్లికూతురి వర్క్‌ ఫ్రం హోం వీడియో.. ఫుల్‌గా కనెక్టయిన నెటిజన్స్

V6 Velugu Posted on Jan 26, 2022

కరోనా మొదలయ్యాక కార్పొరేట్, ఐటీ కంపెనీలు అన్ని వర్క్ ఫ్రం హోం బాట పట్టాయి. ఈ వర్క్ ఫ్రం హోం షురూ అయ్యాక.. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులకు వర్క్ అవర్స్‌తో సంబంధం లేకుండా 12 గంటల వరకూ పని చేయించుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కొన్ని కంపెనీల్లో ప్రొడక్టివిటీ తగ్గిందన్న కంప్లైంట్స్ ఉంటే.. మరి కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల్ని పిండేస్తున్నారని వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు చెబుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఓ పెండ్లి కూతురి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది గంటల్లో తన పెండ్లి ఉందనగా కూడా వర్క్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ సమయంలోనూ ఆమె ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుని వర్క్ చేస్తూనే ఉంది. వరుగా వస్తున్న కాల్స్‌ మాట్లాడుతోంది. ఒక దశలో విసిగిపోయిన ఆమె ‘‘ఇవాళ నా పెండ్లి అని అర్థమయ్యేలా చెప్పిండి” అంటుంది.

వీడియోకు బాగా కనెక్ట్ అయిన నెటిజన్స్

పెండ్లి రోజు కూడా ఆమె పడుతున్న వర్క్ ఫ్రం హోం ట్రబుల్స్‌ను ఆమెకు మేకప్ చేసేందుకు వచ్చిన ఆర్టిస్ట్ సోనా కౌర్ వీడియో తీసింది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆమె పేజ్‌లో ఉన్న వీడియోల్లో ఏదీ గట్టిగా 30 వేల వ్యూస్ కూడా దాటలేదు. అలాంటిది ఈ వీడియోకు నెటిజన్స్ ఓ రేంజ్‌లో కనెక్ట్ అయిపోయారు. ఈ నెల 15న పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా చూశారు. దాదాపు 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ‘పెళ్లి రోజు కూడా లీవ్ పెట్టుకోలేదా? ఏంటి?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ యువతి అయితే తన పెండ్లి రోజు కూడా ఇలానే అవుతుందేమోనని భయంగా ఉందంటూ కామెంట్ పెట్టింది. సో క్యూట్ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అరే మీకు లీవ్స్ లేవా ఏంటి? అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

మరిన్ని వార్తల కోసం..

ఏడు కోట్ల ఫేక్ కరెన్సీ సీజ్.. అన్నీ 2 వేల నోట్లే

పాక్ సరిహద్దులో ఒళ్లు గగుర్పొడిచేలా భారత సైనికుల పరేడ్

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

Tagged wedding day, Viral Video, bride, Hilarious

Latest Videos

Subscribe Now

More News