ఏడు కోట్ల ఫేక్ కరెన్సీ సీజ్.. అన్నీ 2 వేల నోట్లే

V6 Velugu Posted on Jan 26, 2022

దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. అన్ని నోట్లు కూడా 2 వేల రూపాయలవే ముంద్రించి.. సర్క్యులేట్ చేసిందుకు ప్లాన్ చేశారు. దీని గురించి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రైడ్ చేసి పట్టుకున్నారు.

అంతా రూ.2 వేల నోట్లు ఉన్న ఏడు కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాదీనం చేసుకున్నామని ముంబై క్రైం బ్రాంచ్  డీసీపీ సంగ్రామ్ నిషందర్ తెలిపారు. ఈ సందర్భంగా నకిలీ నోట్ల ముఠాకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారిని కోర్టులో హాజరు పరిచి, ఈ ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు కస్టడీకి కోరామని చెప్పారు. ఈ నెల 31 వరకు పోలీసు కస్టడీకి కోర్టు ఓకే చెప్పిందన్నారు. వారిని ఎంక్వైరీ చేసి.. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సంగ్రామ్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

నిర్భయ స్క్వాడ్: మహిళల సేఫ్టీ కోసం 145 వెహికల్స్

పాక్ సరిహద్దులో ఒళ్లు గగుర్పొడిచేలా భారత సైనికుల పరేడ్

ఎన్టీఆర్‌ పేరు‌తో జిల్లా.. స్పందించిన ఆయన బిడ్డ

Tagged Mumbai Police, fake Indian currency

Latest Videos

Subscribe Now

More News