మహిళా సేఫ్టీ కోసం 145 నిర్భయ స్క్వాడ్ వెహికల్స్

మహిళా సేఫ్టీ కోసం 145 నిర్భయ స్క్వాడ్ వెహికల్స్

మహిళల రక్షణ కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇవాళ 145 నిర్భయ స్క్వాడ్ వెహికల్స్‌ను ప్రారంభించారు. ముంబైలో వీటిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా భద్రత విషయంలో ఇతర రాష్ట్రాలకు మహారాష్ట్ర ఆదర్శంగా నిలవాలన్నారు. మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌ లైన్ నంబర్ 103ను అందుబాటులోకి తెస్తున్నామని, ఆపద సమయంలో ఆ నంబర్‌‌కు కాల్ చేస్తే పోలీసులు వచ్చి రక్షిస్తారని చెప్పారు. మహిళల భద్రతే తమ ప్రభుత్వ తొలి ప్రయారిటీ అని, ఈ విషయంలో ఏ లోపం జరగకుండా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

నిర్భయ స్క్వాడ్‌ థీమ్‌కుకు అమితాబ్ వాయిస్‌

కాగా, ఈ సందర్భంగా ముంబై పోలీసులు నిర్భయ స్క్వాడ్ థీమ్‌ వీడియోను లాంచ్ చేశారు. దీనికి మ్యూజిక్‌ను రోహిత్ శెట్టి కంపోజ్‌ చేయగా.. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ గాత్ర దానం చేశారు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌‌ చేసిన రోహిత్ శెట్టి.. ముంబై మహిళలంతా తమ స్పీడ్‌ డయల్‌లో 103 నంబర్‌‌ను యాడ్‌ చేసుకోవాలని కోరారు. ముంబై పోలీసులతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని రోహిత్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

రిపబ్లిక్‌ డే పరేడ్ తర్వాత విరాట్‌ రిటైర్‌‌మెంట్.. ప్రధాని వీడ్కోలు

పాక్ సరిహద్దులో ఒళ్లు గగుర్పొడిచేలా భారత సైనికుల పరేడ్

ప్లాస్టిక్ వస్తువులపై ఒమిక్రాన్ లైఫ్ 8 రోజులు