నిఫ్ట్‌‌లో డిజైన్ ​డిగ్రీ కోర్సులు

నిఫ్ట్‌‌లో డిజైన్ ​డిగ్రీ కోర్సులు

నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) దేశవ్యాప్తంగా ఉన్న 18 క్యాంపస్‌‌లలో అకడమిక్ సెషన్ 2023–24కు బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అభ్యర్థులు ఆన్‌‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు: బ్యాచిలర్ ప్రోగ్రామ్‌‌: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్‌‌)లో  ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్‌‌టైల్ డిజైన్/ నిట్‌‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మాస్టర్స్ ప్రోగ్రామ్‌‌: ఇందులో మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్‌‌), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌‌మెంట్ (ఎంఎఫ్‌‌ఎం), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌‌టెక్‌‌) కోర్సులు అందిస్తోంది. పీహెచ్‌‌డీవిభాగంలో కోర్సులు ఉన్నాయి. 

అర్హతలు: యూజీ ప్రోగ్రామ్‌‌కు ఇంటర్​ ఉత్తీర్ణత; పీజీ ప్రోగ్రామ్‌‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌‌టెక్‌‌, బీఈ, బీటెక్‌‌; పీహెచ్‌‌డీ ప్రోగ్రామ్‌‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీకి 24 సంవత్సరాలు మించకూడదు. పీజీ కోర్సుకు వయోపరిమితి లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

దరఖాస్తులు:  యూజీ, పీజీ ప్రోగ్రామ్​కు డిసెంబర్​ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 5న నిర్వహిస్తారు. సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూలు ఏప్రిల్​లో జరుగుతాయి. పీహెచ్‌‌డీ కోర్సుకు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. మే లో పరీక్ష, జూన్​లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వివరాలకు www.niftadmissions.in వెబ్​సైట్​ సంప్రదించాలి.