ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో టాప్‌‌లోనే మంధాన..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో టాప్‌‌లోనే మంధాన..

దుబాయ్:  ఇండియా విమెన్స్ టీమ్ స్టార్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌లో టాప్ ప్లేస్‌‌లో దూసుకెళ్తోంది.  మంగళవారం (అక్టోబర్ 07)  విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డే వరల్డ్ కప్‌‌లో రెండు మ్యాచ్‌‌ల్లో నిరాశపరచడంతో  ఆమె రేటింగ్ పాయింట్లు తగ్గాయి. ప్రస్తుతం తన ఖాతాలో  791 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 

రెండో ర్యాంక్‌‌లో ఉన్న  ఇంగ్లండ్ స్టార్ సివర్ -బ్రంట్ కంటే కేవలం 60 పాయింట్ల ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (713 పాయింట్లు) మూడో ర్యాంక్‌‌లో నిలవగా.. వరల్డ్ కప్‌‌లో న్యూజిలాండ్‌‌పై సెంచరీతో మెరిసిన సౌతాఫ్రికా ప్లేయర్‌‌‌‌ తజ్మిన్ బ్రిట్స్ (706)  ఆరు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. 

ఆస్ట్రేలియా ఆల్‌‌రౌండర్ ఆష్లే గార్డ్‌‌నర్ (697) ఏకంగా ఏడు ర్యాంక్‌‌లు మెరుగై తన కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌‌ సాధించింది.  బౌలర్లలో ఇంగ్లండ్‌‌కు చెందిన సోఫీ ఎకిల్‌‌స్టోన్ 792 రేటింగ్ పాయింట్లతో టాప్‌‌లో కొనసాగుతోంది. ఇండియా స్పిన్నర్ దీప్తి శర్మ (640 ) ఐదు నుంచి ఆరో ర్యాంకుకు పడిపోయింది. ప్రస్తుతం ఇండియా నుంచి దీప్తి మాత్రమే టాప్–-10 బౌలర్లలో ఉంది.