అరుదైన ట్రీట్మెంట్.. మూలకణాలు, కీమోతో క్యాన్సర్ నాశనం

అరుదైన ట్రీట్మెంట్.. మూలకణాలు, కీమోతో క్యాన్సర్ నాశనం

హైదరాబాద్, వెలుగు: రోగి సొంత మూలకణాలను సేకరించి, అధిక మోతాదు కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ కణాలను నాశనం చేసినట్లు విద్యానగర్ దుర్గాబాయి దేశ్‌‌‌‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు తెలిపారు. క్లిష్టమైన బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ ను విజయవంతంగా పూర్తి చేశామని ప్రకటించారు. మౌలాలికి చెందిన 58 ఏండ్ల వ్యక్తికి హై గ్రేడ్ నాన్ హాడ్కిన్ లింఫోమా అనే అరుదైన క్యాన్సర్ సోకిందని, వేరే చోట సిక్స్​సైకిల్స్​కీమోథెరపీ తీసుకున్నా తగ్గలేదు.

డీడీ రెనోవా సెంటర్​కు రాగా, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యు.ఆజాద్ చంద్రశేఖర్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్ డా.విశాల్ టోకా నేతృత్వంలో ఆటోలోగస్ బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. నెల రోజులకే డిశ్చార్జ్ చేశారు. చికిత్స చేసిన డాక్టర్లు మాట్లాడుతూ ఈ ప్రక్రియలో రోగి సొంత మూలకణాలను తీసుకున్నామని, ఎక్కువ కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ ను పారదోలామని చెప్పారు. దాచిపెట్టిన మూలకణాలను తిరిగి శరీరంలోకి పంపి కణాల ఉత్పత్తిని పునరుద్ధరించామన్నారు.