నాకో రూల్.. బీజేపీ మంత్రులకో రూలా?

నాకో రూల్.. బీజేపీ మంత్రులకో రూలా?

శ్రీనగర్: భద్రతాపరమైన కారణాలను చూపుతూ తనను నిర్బంధించడంపై పీడీపీ ప్రెసిడెంట్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సీరియస్ అయ్యారు. కశ్మీర్‌‌లో జరుగుతున్న డిస్ట్రిక్ట్ డెవలప్‌‌మెంట్ కౌన్సిల్ (డీడీసీ) ఎన్నికల క్యాంపెయినింగ్‌‌లో బీజేపీ నేతలు స్వేచ్ఛగా పాల్గొంటున్నారని, తనను మాత్రం ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ‘పదిహేను రోజుల్లో మూడోసారి నన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? నన్ను సెక్యూరిటీ కారణాలు చూపెట్టి ఆపుతున్నారు. అదే బీజేపీ మంత్రులు మాత్రం స్వేచ్ఛగా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. డీడీసీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరే వరకు నేను ఇలాగే ఎదురుచూడాలా?’ అని మెహబూబా పేర్కొన్నారు.