Monkey Man OTT: హనుమంతుడి స్పూర్తితో మంకీ మ్యాన్.. OTTకి వచ్చేసిన కొత్త సినిమా!

Monkey Man OTT: హనుమంతుడి స్పూర్తితో మంకీ మ్యాన్.. OTTకి వచ్చేసిన కొత్త సినిమా!

స్లండాగ్ మిలియనీర్ నటుడు దేవ్ పటేల్(Dev Patel) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మంకీ మ్యాన్(Monkey Man). ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు దర్శకుడు కూడా దేవ్ పటేలే. ఇండియన్ మైథాలజీలో ప్రముఖ పాత్ర అయిన హనుమంతుడి స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాడు దేవ్ పటేల్. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. 

Also Read:సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!

అయితే ప్రపంచమంతా అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమా సెన్సార్ కారణాల వల్ల ఇండియాలో మాత్రం విడుదల అవలేదు. ఇక అప్పటినుండి ఈ సినిమా రిలీజ్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హనుమంతుడి బ్యాక్డ్రాప్ కావడంతో ఆ ఉత్సవాహం ఇంకాస్త ఎక్కువైంది. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ.. మంకీ మ్యాన్ సినిమాను ఓటీటీ లో విడుదల చేశారు మేకర్స్. ఎలాంటి ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్‌, ఆపిల్ టీవీలోకి స్ట్రీమింగ్ కి వచ్చింది ఈ సినిమా. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు ఆడియన్స్.

ఇక మంకీ మ్యాన్ కథ విషయానికి వస్తే.. యాతనా అనే ఒక సిటీ. అక్కడ హీరో రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతను ఒక అమ్మాయిని వ్యభిచార కూపం నుండి రక్షించాల్సి వస్తుంది. అందుకోసం ఒక క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? హీరోకి ఆ ఆఫీసర్‌కి ఉన్న లింక్ ఏంటి?  అనేది మిగిలిన కథ. వీలుంటే మీరు కూడా మంకీ మ్యాన్ సినిమా చూసేయండి.  

  • Beta
Beta feature