
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘దేవగుడి’. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘నాయకుల నిబద్ధతను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. తమను సపోర్ట్ చేస్తున్న వారందరికీ నటీనటులు ధన్యవాదాలు తెలియజేశారు. రఘుబాబు, అన్నపూర్ణమ్మ, రఘు కుంచె, రాకెట్ రాఘవ, ఇమ్మాన్యుయెల్, ప్రభావతి, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్ కె మదీన్ సంగీతం అందిస్తున్నాడు.