మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి అప్డేట్ పై ఫ్యాన్స్ తమ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు.
ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా..తాజాగా దేవర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2 గంటల 58 నిమిషాలు (178 నిమిషాలు) రన్‌టైమ్‌ను సెన్సార్ ఆమోదించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు U/A సర్టిఫికెట్‌ను ఇవ్వడంతో పాటు, సినిమా బాగుందని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులతో అన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also read:-కమల్ హాసన్, మణిరత్నం సినిమాలో నటిస్తున్నా
అయితే, దేవర లెన్తీ రన్ టైంతో మేకర్స్..ఎన్టీఆర్ అభిమానుల అంచనాలు అందుకోవడం కత్తిమీద సాములాంటింది. కానీ, మేకర్స్కు ఆ విషయంలో ఎలాంటి భయం లేదు.ఎందుకంటే, సినిమా కథ, కథనం, ఎన్టీఆర్ స్వాగ్ దేవరలో అదిరిపోయిందని యూనిట్ సభ్యుల నుంచి టాక్ వినిపిస్తోంది.
అయితే, ఇటీవల బాక్సాఫీసు ముందుకొచ్చిన పలు చిత్రాల నిడివి దాదాపు 3 గంటలు ఉండటం గమనార్హం. కంటెంట్ బాగుంటే రన్‌టైమ్ ఎంతున్నా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే విషయాన్ని ‘కల్కి’ (180.56 నిమిషాలు), ‘సరిపోదా శనివారం’ (2: 50 గంటలు)లాంటి చిత్రాలు మరోసారి నిరూపించాయి.
య్యుట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ సినిమాల సరసన దేవర టాప్ లి నిలిచింది. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ రెబల్స్ రీసెంట్ హిట్స్ కల్కి, సలార్ అడ్వాన్స్ సేల్స్ ను క్రాస్ చేసింది.
అంతేకాకుండా..ఈ చిత్రాన్ని ఒక పార్ట్‌లో చెప్పడం కష్టమని, అందుకే రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నామని దర్శకుడు కొరటాల శివ ఇదివరకే చెప్పారు. ఆకర్షణీయమైన కథనం, ఎన్టీఆర్ స్పెల్ బౌండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల రన్ టైమ్ సమస్య ఉండదని చిత్రనిర్మాతలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
దేవర సెన్సార్ టాక్
దేవర సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. సినిమాలో కథా కథనాలు,ఎన్టీఆర్ డైలాగ్స్,ఎన్టీఆర్ మేనరిజమ్ ఆకట్టుకున్నాయని.. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ కి థియేటర్లు షేక్ అవడం, ప్రేక్షకులు విజిల్స్ వేయడం, పేపర్లు చించేయడం ఖాయమని సెన్సార్ సభ్యులు అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ బ్లాక్, దేవర (ఫాదర్ రోల్) ఎపిసోడ్స్ అదిరిపోయాయట. మరీ ముఖ్యంగా చివరి 40 నిమిషాల సీక్వెన్స్ అదిరిపోయిందని, గూస్ బంప్స్ తెప్పించేలా సీన్స్ ప్లాన్ చేశారని, అలాగే సెకండ్ పార్ట్ పై అంచనాలు పెంచేసింది టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఊహించని ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి కొరటాల శివ లీడ్ ఇచ్చారని సెన్సార్ టాక్ ద్వారా తెలిసింది. మరి సినిమా ఎలా ఉండనుండో తెలియాలంటే..మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
'U/A' సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.