పవన్ కోసం కాదు ఎన్టీఆర్ కోసం

పవన్ కోసం కాదు ఎన్టీఆర్ కోసం

ఆ పవర్ ఫుల్ టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ టైటిల్ ఎన్టీఆర్ కు ఫిక్స్ అయ్యిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ కాస్త డిజపాయింట్ అవుతున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే "దేవర".

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు సముద్రఖనితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ కు ఇది రీమేక్. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ దేవుడిగా కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాకు  దేవర అనే టైటిల్ ను పరిశీలించారు. కానీ చివరికి ఈ సినిమాకు "బ్రో" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్.

దీంతో పవర్ ఫుల్ టైటిల్ దేవర ను ఎన్టీఆర్ కోసం వాడేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా చాలా పవర్ఫుల్ గా ఉండనుందట. అందుకే ఈ సినిమాకు దేవర టైటిల్ ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. ఇదే టైటిల్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా కోసం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.