
దేవరకొండ, వెలుగు : నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్రెడ్డి ఉన్నారు.