గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. నల్గొండ జిల్లా దేవరకొండలో విధులు నిర్వహిస్తున్న జైపాల్ రెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్  గుండెపోటుతో మృతి చెందాడు. నాంపల్లి మండలంలోని తన ఇంట్లో రాత్రి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలిస్తుండగా జైపాల్ రెడ్డి మృతి చెందాడు.

జైపాల్ రెడ్డి మృతితో జేఏసీ నాయకులు, కుటుంబ సభ్యులు దేవర కొండ బస్ డిపో వద్ద ఆందోళనకు దిగారు. పరామర్శించేందుకు వచ్చిన డిపో మేనేజర్ ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  జైపాల్ రెడ్డి మృతికి సంతాపంగా ఇవాళ దేవరకొండ బంద్ కు పిలుపునిచ్చారు కార్మికులు.