ఉన్నావ్‌‌‌‌‌‌‌‌ నిందితుడికి బెయిల్‌‌‌‌‌‌‌‌పై నిరసన.. ఢిల్లీ హైకోర్టు ముందు ఆందోళన

ఉన్నావ్‌‌‌‌‌‌‌‌ నిందితుడికి బెయిల్‌‌‌‌‌‌‌‌పై నిరసన.. ఢిల్లీ హైకోర్టు ముందు ఆందోళన

న్యూఢిల్లీ: ఉన్నావ్​ రేప్​ కేసు నిందితుడు, బీజేపీ మాజీ లీడర్ కుల్దీప్​సెంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెయిల్​ఇవ్వడంతో పాటు గతంలో విధించిన జీవిత ఖైదును సస్పెన్షన్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు బయట మహిళా యాక్టివిస్టులు నిరసన చేపట్టారు. ఆలిండియా డెమోక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టు బయట ఆందోళన చేశారు. 

ఇందులో ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి సహా వందలాది మంది మహిళా యాక్టివిస్టులు పాల్గొన్నారు. సెంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన బెయిల్‌‌‌‌‌‌‌‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి బెయిల్ ఎట్ల ఇస్తరు? ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. కోర్టు సెలవులకు రెండ్రోజుల ముందే బెయిల్ ఇచ్చారు. 

మన దేశ ప్రజలు.. ఇది అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు” అని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ హైకోర్టుపై మండిపడ్డారు. కాగా, రేప్‌‌‌‌‌‌‌‌ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో సెంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంకా బెయిల్ రాలేదు. కస్టోడియల్ డెత్‌‌‌‌‌‌‌‌ కేసులో పదేండ్ల శిక్ష పడగా, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. 

ఈ తీర్పు.. అన్యాయం: బాధితురాలి తల్లి 

ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఉన్నావ్ రేప్ బాధితురాలి తల్లి తెలిపారు. ‘‘నేను మొత్తం ఢిల్లీ హైకోర్టును నిందించడం లేదు. కోర్టులపై మా నమ్మకాన్ని వమ్ము చేస్తూ తీర్పు ఇచ్చిన ఇద్దరు జడ్జీలను మాత్రమే నిందిస్తున్నాను. ఇంతకుముందు ఈ కేసులో తీర్పు ఇచ్చిన జడ్జీలు మా కుటుంబానికి న్యాయం చేశారు. 

కానీ ఇటీవల తీర్పు ఇచ్చిన ఇద్దరు జడ్జీలేమో మాకు అన్యాయం చేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది” అని చెప్పారు.