IND vs SA: అసాధారణ నిలకడ.. అద్భుత గణాంకాలు: 80 యావరేజ్ ఉన్నా వన్డే జట్టులో కర్ణాటక బ్యాటర్‌కు నో ఛాన్స్

IND vs SA: అసాధారణ నిలకడ.. అద్భుత గణాంకాలు: 80 యావరేజ్ ఉన్నా వన్డే జట్టులో కర్ణాటక బ్యాటర్‌కు నో ఛాన్స్

టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో పక్కాగా పరుగులు చేయాల్సిందే. డొమెస్టిక్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తారు. అయితే కొన్ని సార్లు దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించినా కొంతమందికి దురదృష్టవశాత్తు భారత స్క్వాడ్ లో చోటు దక్కదు. ఇలాంటి లిస్ట్ లో కర్ణాటక టాలెంటెడ్ బ్యాటర్ దేవదత్ పడికల్ ఉన్నాడు. గత నాలుగేళ్లుగా టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ పడికల్ అసాధారణ ఫామ్ ను చూపిస్తున్నాడు. ఈ కర్ణాటక బ్యాటర్ గణాంకాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ లో పడికల్ ను ఎంపిక చేయడకపోవడంతో ఇప్పుడు అతని ఫస్ట్ క్లాస్ గణాంకాలు వైరల్ అవుతున్నాయి. 

సౌతాఫ్రికాతో నవంబర్ 30 నుంచి జరగబోయే వన్డే సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ శుభమాన్ గిల్.. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ఈ సిరీస్ కు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. తిలక్ వర్మ, రిషబ్ పంత్, ఋతురాజ్ గైక్వాడ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడిన పడికల్ ను మాత్రమే కనీసం పరిగణించలేదు. లిస్ట్ ఏ లో దేవదత్ 33 మ్యాచ్‌ల్లో 2000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వీటిలో 9 సెంచరీలు.. 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 80 యావరేజ్ ఉండడమే కాదు స్ట్రైక్ రేట్ కూడా 90 ఉండడం విశేషం. 

2019-20లో పడికల్ తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడినప్పుడు 11 మ్యాచ్‌ల్లో 67 యావరేజ్ తో 609 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత ఏడాది ఇదే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 147 యావరేజ్ తో   737 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. 2023-24 సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లో 155 యావరేజ్ తో 465 పరుగులు.. గత సీజన్ లో 3 ఇన్నింగ్స్‌ల్లో 65 యావరేజ్ తో 196 పరుగులు చేసి అసాధారణ నిలకడ చూపించాడు. ఇంత నిలకడతో ఆడుతున్నా పడికల్ కు  ఇప్పటివరకు టీమిండియాలో పిలుపు రాకపోవడం విచారకరం.

సౌతాఫ్రికాతో మూడు వన్డేలకు భారత జట్టు:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్