ప్రతి నెల పార్టీలో డెవలప్మెంట్ కనిపించాలి : మాణిక్ రావు థాక్రే

ప్రతి నెల పార్టీలో డెవలప్మెంట్ కనిపించాలి : మాణిక్ రావు థాక్రే

విభేదాలు పక్కన పెట్టి కలిసి కట్టుగా పని చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే దిశానిర్దేశం చేశారు.  రెండు రోజల పర్యటన నిమిత్తం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా  సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ అయ్యారు. నేతలకు వారి జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, బలాబలాలు గురించి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామని నేతలకు థాక్రే సూచించారు. ప్రతి పబ్లిక్ ఇష్యూను వదలకుండా పోరాటం చేయాలని నేతలకు ఆయన చెప్పారు. సర్కార్ వ్యతిరేకతను పార్టీకి కలిసొచ్చేలా వ్యూహరచన చేయాలని నేతలకు థాక్రే సూచించారు. ఈగోలతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని, మనమంతా కుటుంబసభ్యులమేనని నేతలకు వివరించారు. ప్రతి నెల పార్టీలో డెవలప్మెంట్ కనిపించాలని మాణిక్ రావు థాక్రే నేతలకు  చెప్పారు.