భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామాలయం పరిధిలో రూ. 351 కోట్లతో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. భద్రాచలంలోని తూర్పుమెట్ల వద్ద శంకుస్థాపనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎండోమెంట్ కమిషనర్హన్మంతరావు, కలెక్టర్అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కొత్తగా నిర్మించే ఆలయ ప్రాకారాలు, టెంపుల్ కాంప్లెక్స్ బ్లూ ప్రింట్‌ను మంత్రి తుమ్మల రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రాకారాన్ని నాలుగు వైపులా 20 అడుగుల మేర విస్తరించనున్నారు. మొత్తం రూ.586 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు మూడు దశల్లో చేపట్టనున్నారు. శుక్రవారం తొలివిడత పనులకు భూమి పూజ చేస్తారు.
