
ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పై ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ గవర్నర్ కు మద్దతుగా నిలిచారు.
‘‘గవర్నర్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన మహారాష్ట్రకు వచ్చిన తర్వాత మరాఠీ నేర్చుకున్నారు. ఆయనకు మరాఠీలంటే చాలా ఇష్టం. ఇది నేను దగ్గరుండి చూశా. ఆయన ఏదో అన్నారని కాదు. కానీ, మనస్ఫూర్తిగా ఆయన మరాఠాను గౌరవించే మనిషి" అని అమృత ఫడ్నవిస్ విలేకరులతో అన్నారు. కోష్యారీని రీకాల్ చేయాలని ప్రతిపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్న తరుణంలో అమృతా ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేయడం బీజేపీ, -షిండే శివసేన కూటమి సర్కార్‌కు ఇబ్బందికరంగా మారాయి.
మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే కేంద్రం గవర్నర్‌ను "అమెజాన్ ద్వారా మహారాష్ట్రకు పంపిన పార్శిల్"గా పంపిదని అభివర్ణించారు. అంతేకాకుండా కేంద్రం ఆయనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చెపడతమన్నారు.అటు గవర్నర్ వ్యాఖ్యలపై నిరసన కోసం థాక్రే శివసేన వర్గపు నేత సంజయ్ రౌత్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.