
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదల కానుంది. ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఇందులో భాగంగా విజయ్, అనన్య సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు.
ఈ క్రమంలో ఇవాళ ముంబైలో ఓ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఈ జంట ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయణించారు. వారు ట్రైన్ వచ్చే వరకూ రైల్వే స్టేషన్‌లో చాలా సేపు వెయిట్ చేశారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. విజయ్ కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని రిలాక్స్ అయినట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో.. రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు. కాగా, పూరి - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ప్రస్తుతం జనగణమన తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. వంశీ పైడిపల్లి, పూరి జగనాథ్, ఛార్మి నిర్మాతలు.