బీసీలను బీజేపీ మోసం చేస్తున్నది : ఎమ్మెల్యే బాలు నాయక్ విమర్శ

బీసీలను బీజేపీ మోసం చేస్తున్నది : ఎమ్మెల్యే బాలు నాయక్ విమర్శ

హైదరాబాద్, వెలుగు: బీసీలను బీజేపీ మోసం చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ విమర్శించారు. శనివారం ఆయన గాంధీ భవన్‌‌లో నిర్వహించిన ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

అనంతరం బాలు నాయక్ మాట్లాడుతూ.. బీజేపీలో బీసీ నేతలు అధ్యక్ష పదవి చేపట్టే సామర్థ్యం ఉన్నప్పటికీ, వారిని కాదని బీసీ వ్యతిరేకి రాంచందర్ రావుకు బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్‌‌కు చిత్తశుద్ధి ఉందని, అందుకే మల్లికార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షునిగా నియమించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.