వర్గల్ విద్యాధరి సరస్వతీ క్షేత్రంలో ఘనంగా దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు

వర్గల్ విద్యాధరి సరస్వతీ క్షేత్రంలో ఘనంగా దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు
  • అద్వితీయం.. విద్యాధరి క్షేత్రం
  • శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత

గజ్వేల్/వర్గల్,వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లాలోని వర్గల్ విద్యాధరి సరస్వతీ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం విద్యాసరస్వతీ అమ్మవారు అన్నపూర్ణా దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు శ్రీ విద్యాధరి అమ్మవారికి విశేషాభిషేకం. గణపతి పూజ, సుప్రభాతం, గిరిప్ర దక్షణం, అలంకారం,పంచ హారతులు, చండీహోమం ఘనంగా నిర్వహించారు. 

ఉత్సవాలలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ నిర్వాహకులు ఘనస్వా గతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు శేషవస్త్రాన్ని అందజేశారు. వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర మహత్యం గొప్పదని, ఈ పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పం నెరవేరిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం కాగా, కంచి స్వామి ఆశీస్సులు కంచి పీఠం ఆధ్వర్యంలో చక్కటి నిర్వహణ అద్భుతంగా ఉందన్నారు.